
ఇట్స్ మై లవ్ స్టొరీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిత నారాయణ్ కెరీర్ అనుకున్నంత వేగంగా సాగకపోయినా ఆచితూచి మంచి మంచి పాత్రలని సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తోంది. తను చేసిన రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. అవి కాకుండా తను చేస్తున్న ‘నల దమయంతి’ సినిమా ప్రస్తుతం సెట్స్ పైన ఉంది.
తను టైటిల్ రోల్ ప్లే చేస్తోందా? అని ప్రశ్నిస్తే ‘కచ్చితంగా ఈ సినిమాలో నా పాత్ర పేరు దమయంతి కాదు. నల దమయంతి అనేది మన పురాణాలకు సంబందించిన ఓ పాత్ర. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కానీ ఇందులో ఓ చిన్న పీరియడ్ స్టొరీ ఉంటుంది. ఈ చిఎన్మా నా కెరీర్లో మొట్ట మొదటి కమర్షియల్ మూవీ. నా కెరీర్లో మోస్ట్ గ్లామరస్ రోల్ ఈ సినిమాలోనే చేస్తున్నాను. సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ పాత్రకి మంచి స్క్రీన్ స్పేస్ తో పాటు, పాటలు కూడా ఉన్నాయని’ నిఖితా తెలిపింది.
అలాగే తన రాబోయే సినిమాల గురించి చెబుతూ అందరూ ‘తను మొన్నే వెళ్ళిపోయింది’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ ముందు రిలీజ్ అవుతుందని చెప్పింది. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘నల దమయంతి’ సినిమాని నారా రోహిత్ సమర్పణలో రవికుమార్ ప్రసన్న నిర్మిస్తున్నాడు.