
నాగార్జున కెరీర్ లో ‘నిన్నే పెళ్ళాడతా’ ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం. కమర్షియల్ ఎంటర్టైనర్ల జాబితాలో తనకంటూ ఒక మార్కుని సృష్టించుకుని ఈ సినిమాతో టాప్ డైరెక్టర్ ల జాబితాలోకి చేరిపోయాడు కృష్ణవంశీ. 1996 అక్టోబర్ 4న విడుదల అయిన ఈ సినిమా నేటితో 18 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.
ఒక స్వచ్చమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి నాగార్జున, టబుల కెమిస్ట్రీ తోడవ్వడంతో సినిమాను నేటికీ చాలా మంది మర్చిపోలేకపోతున్నారు. ఈ సందర్భంగా నిన్నేపెళ్ళాడతా బృందానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం