
వరుస హిట్స్ తో ఫుల్ జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ‘చిన్నదాన నీ కోసం’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీం లాంగ్ యూరప్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలోని బాలన్స్ పార్ట్ ని ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని దీపావళి కానుకగా రిలీజ్ చేసి సినిమాని డిసెంబర్ 19న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఈ చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇటీవలే రిలీజ్ చేసిన నితిన్ ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది.
‘తొలిప్రేమ’ టైం నుంచి నితిన్ కరుణాకరన్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు, ఆ కోరిక నితిన్ కి ‘చిన్నదాన నీకోసం’ తో నెరవేరింది. అలాగే ఈ సినిమా నితిన్ కి మరో గ్యారంటీ హిట్ అని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.