
‘చిన్నదానా నీకోసం’ లాంటి యావరేజ్ సినిమా తర్వాత కెమెరా ముందుకు వచ్చి మేకప్ వేసుకోవడానికి కాస్త గ్యాప్ ఇచ్చిన యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తను నిర్మాతగా వ్యవహరిస్తున్న అఖిల్ – వివి వినాయక్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. స్వయంగా నితిన్ దగ్గరుండి అన్ని ప్రొడక్షన్ కార్యక్రమాలను, షూటింగ్ లొకేషన్స్ ని ఫైనల్ చేస్తున్నాడు. అఖిల్ మూవీ ప్రొడక్షన్ పనుల్లో ఉంటూనే తన తదుపరి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్పీడ్ గా ఫినిష్ చేస్తున్నాడు. నితిన్ తన నెక్స్ట్ సినిమాని జూన్ మొదట్లో ప్రారంభించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు.
నితిన్ తన తదుపరి సినిమాతో మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడుని పరిచయం చేయనున్నాడు. నితిన్ మెచ్చిన స్టొరీ లైన్ ని డెవలప్ చేసే పనిలో వేణు ఉన్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన రొమాన్స్ చెయ్యడానికి టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుంది. ఈ చిఎన్మా స్టార్ చేసే లోపు అఖిల్ సినిమాని ఫైనల్ స్టేజ్ కి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు.