
‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత యంగ్ లవర్ బాయ్ నితిన్ నటించిన సినిమా ‘చిన్నదాన నీకోసం’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ విడుదలవుతుంది. నితిన్ తన డబ్బింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు.
ప్రేమకధా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభించింది. మిస్తీ చక్రవర్తి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.