
యంగ్ హీరో నితిన్ కి ఒక రేంజ్ లో లేడీ ఫ్యాన్స్ వన్న విషయం తెలిసినదే. అయితే మొన్న రాత్రి ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి నితిన్ పై తన అభిమానాన్ని చూపించడానికి తన ఇంటికి దొంగచాటుగా వెళ్ళింది. వెళ్ళడమేకాక ఆ రాత్రంతా అక్కడే గడిపిందని సమాచారం
శుక్రవారం ఉదయం ఈ అమ్మాయి గురించి తెలుసుకున్న నితిన్ కుటుంబ సభ్యులు ఆమెను పోలీసులకు అప్పగించారు. విచారణలో తాను నితిన్ వీరాభిమానినని కేవలం తనని కలవడంకోసమే అక్కడకు వెళ్ళానని తెలిపింది. ఆ తరువాత ఆమెకు కౌన్సిలింగ్ చేసినట్టు సమాచారం