
వరుస హిట్స్ తో జోరు మీదున్న యంగ్ హీరో నితిన్, కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాని త్వరలో పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ మిస్తి చక్రబోర్తి నితిన్ సరసన హీరోయిన్ గా నటించనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ సినిమాలో అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం.
ఈ సినిమాపై హీరోయిన్ మిస్తి మాట్లాడుతూ ‘కరుణాకరన్ నంకు కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పాను. కథ బాగా నచ్చింది. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ కానీ ఇందులో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. అలాగే నా హీరో నితిన్ గురించి కూడా చాలా విన్నాను. అతనితో పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని’ చెప్పింది.
నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. జూన్ 2 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా షూటింగ్ ఇండియాలోని పలు అందమైన లోకేషన్స్ తో పాటు అబ్రాడ్ లోనూ షూటింగ్ జరుపుకోనుంది.