హీరో నితిన్ పెళ్లి అప్పుడేనా ?

nithin

హీరో నితిన్ ఎట్టకేలకూ పెళ్లి పీటలు ఎక్కుదామని సర్వం సిద్ధం చేసుకున్న వేళ కరోనా రూపంలో ఆయన పెళ్ళికి అడ్డంకి వచ్చి చేరింది. నితిన్ కొద్దిరోజుల క్రితం తన చిరకాల ప్రేయసి శాలినితో నిశితార్థం చేసుకున్నారు. మొదట నితిన్ దుబాయ్‌ లో ఏప్రిల్ 16న డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాలనుకున్నా… క‌రోనా కారణంగా అది కుదరలేదు. ఆ తరువాత త‌న పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు నితిన్ ప్రకటించాడు.

అయితే తాజా స‌మాచారం ప్రకారం నితిన్ త‌న పెళ్ళిని డిసెంబ‌ర్‌ కు వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక వివాహం హైదరాబాద్‌ లో వధువు ఇంటి వద్దే జరుగుతుందట. ఇకపోతే నితిన్ కరోనా అనంతరం వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దే’ చిత్రం షూట్ ను చేయనున్నారు. ఇది కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంళో ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు నితిన్.

Exit mobile version