మరో ఆసక్తికరమైన బయోపిక్ లో టాలెంటెడ్ హీరోయిన్

nitya menon
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మరియు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురిచ్చి తలైవి జయలలితగారి జీవితం ఆధారంగా తమిళ దర్శకురాలు ప్రియదర్శిని బయోపిక్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగారి పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. అయితే చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ చిత్రంలో జయలలిత బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే నిత్యామీనన్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని దర్శకనిర్మాతలు భావించారట. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో నటించే మిగిలిన నటీనటులను కూడా త్వరలోనే ఎంపిక చేస్తామని వి.కె. ప్రకాశ్ తెలిపారు. ఇంతకి జయలలిత పాత్రలో నిత్యామీనన్ ఎలా నటిస్తుందో చూడాలి.

Exit mobile version