అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా అల్లు అర్జున్ సిస్టర్ పాత్రలో నిత్యా మీనన్ నటిస్తుందంటూ గత కొన్ని రోజులుగా మీడియా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను పీఆర్వో ఖండించారు. త్రివిక్రమ్ సినిమాలో నిత్యా మీనన్, అల్లు అర్జున్ సిస్టర్ కాదని స్పష్టం చేశారు.
ఈ సినిమాకు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. సమంత, అదా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తర్వాత పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. వేసవి ప్రధమార్ధంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
