‘పిల్లా నువ్వులేని జీవితం’ దర్శకుడితో నితిన్..?

nithin-as-ravikumar-chowdar
ఏఎస్ రవి కుమార్ దర్శకత్వంలో యువ హీరో నితిన్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అనేది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ న్యూస్. ఇటివలే దర్శకుడు నితిన్ ను కలిసి కథ వినిపించారు. రత్నబాబు అనే రచయిత సహకారంతో ఈ కథను దర్శకుడు రచించారు. కథ నచ్చడంతో నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత రవి కుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వినోదానికి, కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారట. ప్రస్తుతం స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే ప్రయత్నంలో దర్శక రచయితలు ఉన్నారు. 2008లో నితిన్, రవి కుమార్ చౌదరి కలయికలో ‘ఆటాడిస్తా’ సినిమా కోసం కలిసి పని చేశారు.

Exit mobile version