అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇంతకీ, సుప్రియ యార్లగడ్డ ఏం మాట్లాడారు అంటే.. ‘శేష్ ఇప్పటివరకూ చేసిన సినిమాల కంటే ఇది చాలా భిన్నమైన సినిమా. ఇక సినిమా రంగంలో మహిళల భద్రత గురించి మాట్లాడుతూ.. ఎక్కువమంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి’ అని ఆమె కోరారు.
సుప్రియ ఇంకా మాట్లాడుతూ.. ‘మా సినిమా కోసం ఎంతోమంది మహిళలు వర్క్ చేశారు. ఇప్పుడు వర్క్ జరిగే ప్లేస్ కు వెళ్లినా కనీసం ఐదుగురు అమ్మాయిలు ఉంటారు. ఎక్కువ మంది మహిళలు ఇండస్ట్రీకి వస్తే అసమానతలు తొలగిపోతాయి. నాకు సినిమా నేపథ్యం ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. అది నాకు భరోసానిచ్చింది’’ అని అన్నారు. కొవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. థియేటర్‌తో పాటు ఓటీటీల్లోనూ మంచి సినిమాలకు ఆదరణ దక్కుతోంది’ అని సుప్రియ తెలిపారు.
