
తమిళంలో మాస్ హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగబ్బాయి విశాల్. ‘పందెం కోడి’ మొదలుకుని విశాల్ నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఇక్కడి ప్రేక్షకులు చూపిన ఆదరణ పట్ల విశాల్ సంతోషం వ్యక్తం చేశారు. పలు సందర్భాలలో త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
శశికాంత్ దర్శకత్వంలో స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. శశికాంత్ చెప్పిన కథకు విశాల్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2015లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయి. త్వరలో హీరోయిన్, టెక్నీషియన్లు తదితర వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.