శివ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’చిత్రం యొక్క షూటింగ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అజిత్ డ్యూయెల్ రోల్ లో కనిపించనునున్నాడు. కాగా తాజాగా ఈ చిత్రం విడుదల పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.
కాగా స్టార్ హీరోయిన్ నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర తమిళ థియేట్రీకల్ హక్కులను 48కోట్ల భారీ ధరకు కేజేఆర్ స్టూడియోస్ దక్కించుకుంది. ఇక ‘వివేగం’ తరువాత అజిత్ నటించిన ఈ చిత్రం ఫై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
మోషన్ పోస్టర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
