ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా భారీ చిత్రం ‘రాకా’ చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. ఇక ఈ సినిమా తర్వాత కూడా బన్నీ మాసివ్ లైనప్ ని సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే తన లైనప్ విషయంలో బన్నీ తెలుగు మినహా దాదాపు ప్రాజెక్ట్ లు అన్నీ ఇతర ఇండస్ట్రీ దర్శకులతోనే కనిపిస్తూ ఉండడం గమనార్హం.
తనకి పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో బన్నీ పాన్ ఇండియా వైడ్ గా ఒకో స్టార్ దర్శకునితో వర్క్ చేసే ప్లానింగ్ లో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఆల్రెడీ కోలీవుడ్ నుంచి అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్ లతో క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇక మలయాళం సినిమా నుంచి మిన్నల్ మురళీ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో సినిమా అనధికారికంగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.
ఇక మిగిలింది కన్నడ, హిందీ మాత్రమే మిగిలాయి. ఇందులో హిందీ నుంచి కూడా బన్నీ చేసే ఛాన్స్ ఉందట. అయితే ఈ క్రమంలో ఒకో ప్రాజెక్ట్ పెరుగుతూ వెళుతుంది కానీ తెలుగు దర్శకులకి మాత్రం బన్నీ దూరం అవుతున్నాడనే అనుకోవాలి.
పుష్ప ఫ్రాంచైజ్ సుకుమార్ కోసం పక్కన పెడితే కొత్త దర్శకుల్లో తెలుగు నుంచి బన్నీ లిస్ట్ లో సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఒక్కరు మాత్రమే లైనప్ లో ఉన్నారు. తాను మినహా మరో కొత్త దర్శకునితో ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ లేదు. సో రానున్న రోజుల్లో మరో టాలీవుడ్ దర్శకునితో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది చూడాలి.
