సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు చేస్తున్న మాస్ యాక్షన్ సినిమానే ధర్మన్. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యింది. అయితే ఇంత వేగంగా పూర్తి అవుతున్న ఈ సినిమా విడుదల కూడా త్వరగానే ఉండొచ్చు అనే టాక్ ఇప్పుడు సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ప్రస్తుతానికి ఉన్న బజ్ ప్రకారం ధర్మన్ కూడా సంక్రాంతి సీజన్ లో రానున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సో ఇదే నిజం అయితే కొన్నే నెలల వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రజినీకాంత్ నుంచి ఉంటాయని చెప్పొచ్చు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే లెజెండరీ హీరో కమల్ హాసన్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
