మరోసారి ప్రభాస్-మారుతి కాంబో.. అవన్నీ రూమర్లే..!

Prabhas Maruthi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వచ్చిన హారర్-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరచడంతో ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. అయితే, ఈ సినిమా ప్లాప్ తర్వాత ప్రభాస్ మరోసారి మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వస్తున్న వార్తలు అభిమానుల్లో తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. ఈ పుకార్ల నేపథ్యంలో ప్రభాస్ పిఆర్ టీమ్ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది. మారుతితో ప్రభాస్ మరో సినిమా చేస్తున్నారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వారు కొట్టిపారేశారు. ఇవి కేవలం నిరాధారమైన పుకార్లని, ప్రభాస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలని సృష్టించినవని వారు స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లయింది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రాలపై దృష్టి సారించారు. ఆయన నటిస్తున్న ‘ఫౌజీ’ మరియు ‘స్పిరిట్’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. రాబోయే 14 నెలల్లోనే ఈ రెండు సినిమాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ఈ ప్రాజెక్టులపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version