విడుదల తేదీ : జనవరి 30, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్
దర్శకుడు : కిషోర్ పాండురంగ్
నిర్మాతలు: రాజేష్ కేజ్రీవాల్, గుర్పల్ సచార్
సంగీతం : ఏ.ఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం : కరణ్ బి రావత్
కూర్పు : ఆశిష్ మాత్రె
సంబంధిత లింక్స్ : ట్రైలర్
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు ముఖ్య పాత్రల్లో నటించిన మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. కిశోర్ పాండురంగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
Gandhi Talks కథ :
ముంబై స్లమ్‌లో నివసించే నిరుద్యోగి మహదేవ్(విజయ్ సేతుపతి) ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అనేక కష్టాలు పడుతుంటాడు. లంచం ఇచ్చుకోలేక ఉద్యోగం సాధించలేక అవస్థలు పడుతుంటాడు. తన పక్కింట్లో ఉండే అమ్మాయి(అదితి రావు హైదరి)ని అతడు ప్రేమిస్తాడు. ఒకప్పుడు మంచి బిల్డర్‌గా జీవించిన బోస్‌మెన్ (అరవింద్ స్వామి) కొన్ని లీగల్ కారణాల వల్ల తన సామ్రాజ్యాన్ని కోల్పోతాడు. వీరి ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? అనేది ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఎలాంటి డైలాగులు లేకుండా సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టతరమో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో దర్శకుడు కిశోర్ పాండురంగ్‌ను తప్పకుండా అభినందంచాల్సిందే. అయితే, ఇలాంటి ప్రయోగాన్ని స్టార్ క్యాస్ట్‌పై చేయడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ముగ్గురు స్టార్స్ ఈ మూకీ సినిమాలో నటిస్తున్నారు అనగానే ఈ సినిమాపై ఆటోమేటిక్‌గా అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ప్రేక్షకుల అటెన్షన్ పొందడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో కిశోర్ పాండురంగ్ ఎలాంటి డైలాగులు లేకుండా వారిని థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాలోని కామెడీ పోర్షన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. దీంతో గాంధీ టాక్స్ ఏదో ఒక ఆర్ట్ సినిమాలా కాకుండా ఓ ఫన్ ఎంటర్‌టైనర్‌గా మారింది. ఈ సినిమాను విజయ్ సేతుపతి తన భుజాలపై మోశాడు.
మహదేవ్ పాత్రలో విజయ్ సేతుపతి అమాయకంగా నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కష్టాలను ఎదుర్కొని అతడు సాగించే జీవినం ప్రేక్షకులను మెప్పిస్తుంది. అరవింద్ స్వామి బిజినెస్‌లో నష్టం వచ్చిన వ్యక్తిగా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సిద్ధార్థ్ జాదవ్ దొంగ పాత్రలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. అదితి రావు హైదరి కూడా తనవంతు పాత్ర పోషించింది. సెకండాఫ్‌లోని కామెడీ సీన్స్ సినిమాను మరింత ఎంగేజింగ్‌గా మార్చాయి.
మైనస్ పాయింట్స్ :
‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) చిత్రం కథ పరంగా ఎలాంటి కొత్తదనాన్ని తీసుకురాలేదు. చాలా సినిమాల్లో చూసిన టెంప్లేట్ మనకు ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో ఈ సినిమా టాలీవుడ్ హిట్ చిత్రం ‘వేదం’ తాలూకా జ్ఞాపకాలను గుర్తుకు చేస్తుంది.
‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) ఒక మూకీ చిత్రం కావడంతో చాలా విషయాలను వాట్సాప్ మెసేజ్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లు, నోట్స్ రూపంలో మనకు వివరించారు. ప్రేక్షకులు వీటిలో ఏదైనా మిస్ అయితే, వారికి కథలోని ఫ్లో తప్పినట్లుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల సినిమా పేస్‌ను కాస్త నెమ్మదిగా తీసుకెళ్లాల్సింది.
ఈ సినిమా రొటీన్ చిత్రాలను ఇష్టపడేవారి కోసం తీసింది కాదు. లెంగ్తీ క్లైమాక్స్ సాగదీతగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకాస్త బాగా వర్కవుట్ చేయాల్సింది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని బోరింగ్ మూమెంట్స్, స్లో పేస్ మెప్పించవు. మహేష్ మంజ్రేకర్ పాత్ర అసంపూర్తిగా ఉన్నట్లు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
కిశోర్ పాండురంగ్ దర్శకుడిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆయన ఎంచుకున్న కథ గొప్పది కాకపోయినా, ఆయన ఈ సినిమాను మలిచిన తీరు మాత్రం అభినందనీయం. కొన్ని సీన్స్‌ను ఆయన హ్యాండిల్ చేసిన విధానం సూపర్. నటీనటుల నుంచి సాలిడ్ పర్ఫార్మెన్స్‌లను ఆయన రాబట్టుకున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరో అసెట్. ఎలాంటి డైలాగులు లేని ఈ సినిమాను ఆయన తన బీజీఎంతో నడిపించిన తీరు బాగుంది. కరణ్ బి రావత్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. సినిమాలోని నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks) అనే మూకీ చిత్రంతో చేసిన ప్రయోగం కొంతవరకు వర్కవుట్ అయ్యిందని చెప్పాలి. కథలో డబ్బు, లంచం అనే అంశాలు రొటీన్ అయినా, ఎలాంటి డైలాగులు లేకుండా కథను ముందుకు తీసుకెళ్లిన తీరు మెప్పిస్తుంది. కామెడీపై ఎక్కువ ఫోకస్ పెట్టడం ప్లస్ అయ్యింది. నటీనటులు తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. ఫస్ట్ హాఫ్‌లోని బోరింగ్ మూమెంట్స్, రొటీన్ కథ మైనస్. ప్రయోగాత్మక చిత్రాలు ఇష్టపడేవారు ఈ సినిమాని తక్కువ అంచనాలతో చూడడం బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
