పెద్ది : ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండానే కుస్తీ పోర్షన్స్..!

peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ సినిమాలో వైరల్ అయిన కుస్తీ సీన్ల గురించి రత్నవేలు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఈ సినిమాలో కుస్తీ పోర్షన్స్ అన్నీ కూడా న్యాచురల్ యాక్షన్‌తో రూపొందించినవని ఆయన తెలిపారు.

అంతేగాక, ఈ సీన్స్‌లో ఎక్కడా VFX వాడలేదని అంతా సహజంగా చిత్రీకరించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా మాంసాహారం తీసుకోకుండానే చరణ్ చాలా తక్కువ సమయంలో రెజ్లర్ బాడీని సాధించడం ఆయన డెడికేషన్‌ను చూపిస్తుందని రత్నవేలు ప్రశంసించారు. ఈ చిత్రంలో చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్ చేస్తాయని తెలిపాడు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Exit mobile version