‘పెద్ది’కి మృణాల్ హ్యాండ్.. ‘అఖండ 2’ బ్యూటీ ట్రాక్ లోకి?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ స్పోర్ట్స్ డ్రామానే “పెద్ది”. భారీ అంచనాలు సెట్ చేస్తున్న ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా షూట్ ఆలస్యం కారణంగా మరోసారి వాయిదా పడింది. అయితే దీనికి ప్రధానంగా ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రం బాలన్స్ ఉందని మేకర్స్ తెలిపారు.

అయితే ఈ సాంగ్ కోసం మొదట మృణాల్ ఠాకూర్ తో సంప్రదింపులు జరిగినట్టు టాక్ వచ్చింది. అలానే ఫ్యాన్స్ కూడా ఆమెనే ఖరారు అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఆమె బదులు మరో బ్యూటీ రేస్ లోకి వచ్చి ట్విస్ట్ ఇచ్చింది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు భీమ్లా నాయక్, అఖండ 2, బింబిసార, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించిన నటి సంయుక్త మీనన్ అట.

ఈమెనే పెద్ది లో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలో వస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version