‘పెద్ది’లో ఇదొక్కటే కాదు.. కాన్సెప్ట్ పై ఆసక్తికర డీటెయిల్ బయటకి!

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”(Peddi). దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మంచి హైప్ ని సెట్ చేసుకుంది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ మంచి ట్రీట్ ని కూడా అందించింది. అయితే ఇదే సాంగ్ లో దీనికి ముందు వచ్చిన పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ లో మేకర్స్ క్రికెట్ ని హైలైట్ చేస్తున్నట్టు చూపించారు.

దీనితో అంతా ఈ సినిమాలో క్రికెట్ ని మాత్రమే ప్రధానంగా తీసుకున్నట్టు చాలా మంది అనుకున్నారు కానీ ఈ చిత్రం మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుందట. అంటే ఒక్క క్రికెట్ మాత్రమే కాకుండా మరిన్ని క్రీడలు ఈ సినిమాలో కనిపిస్తాయని చెప్పొచ్చు. మరి రామ్ చరణ్ తో బుచ్చిబాబు ఏం ప్లాన్ చేసాడో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version