‘రాకా’కి ముందు ఈ ఇద్దరు సంగీత దర్శకులని అనుకున్నారట!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ కలయికలో చేస్తున్న భారీ చిత్రమే రాకా. ఓ గ్లోబల్ లెవెల్ సబ్జెక్ట్ తో గ్రాండ్ విజువల్స్ కలగలిపిన సినిమాగా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

నిజానికి ఈ సినిమాకి సాయి పేరు అనౌన్స్ చేయడం చాలామందికి సర్ప్రైజింగ్ గా అనిపించింది. దాదాపు అంతా అనిరుద్ తోనే అట్లీ వెళ్తాడు అనుకున్నారు. కానీ సాయి అభ్యంకర్ పేరు చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. అయితే అసలు సాయి కంటే ముందు వేరే ఇద్దరు సంగీత దర్శకుల్లో ఒకరితో సినిమా చేద్దామని అట్లీ అనుకున్నాడట.

ఇపుడు ఫుల్ ఫామ్ లో ఉన్న జీవి ప్రకాష్ గాని లేదా అనిరుద్ తోనే రాకా కి వర్క్ చేద్దాం అనుకున్నాడట. తనకి ఎలాగో రెండు మూడు సినిమాలు తర్వాత సంగీత దర్శకున్ని మార్చడం అలవాటు. సో అలా ఆ ఇద్దరిని అనుకుంటున్న సమయంలో నిర్మాత మారన్ తో మాట్లాడినప్పుడు సాయి పేరు సూచించారు అని అసలు విషయం తెలిపాడు. సో ఇలా ఈ భారీ ప్రాజెక్ట్ లోకి సాయి అభ్యంకర్ ఎంటర్ అయ్యాడు.

Exit mobile version