ఈ ఏడాది జరిగిన ఎన్నో దారుణ విషాధ ఘటనల్లో అనేక సినీ ఇండస్ట్రీలలో ప్రముఖ నటులను టెక్నిషియన్స్ ను కోల్పోవడం వంటివి ప్రతీ ఒక్కరినీ ఎంతగానో కలచి వేసాయి. అలాగే తాజాగా తమిళ స్మాల్ స్క్రీన్ కు చెందిన ప్రముఖ నటి చైత్ర ఆత్మహత్య చేసుకుందన్న వార్త అక్కడ తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.
ఇక అసలు వివరాల్లోకి వెళ్తే చెన్నై లోని ఒక హోటల్లో తన బిజినెస్ మెన్ అలాగే ఫియాన్స్ హేమంత్ తో కలిసి ఒక హోటల్ లో దిగారు. ఆ సమయంలో ఆమె స్నానానికి వెళ్లి చాలా సేపు బయటకు రాలేదని దీనితో తాను డోర్ కొట్టినా రాకపోయే సరికి హోటల్ సిబ్బందిని డూప్లికేట్ తాళంతో డోర్ ఓపెన్ చెయ్యగా ఆమె ఉరి వేసుకొని కనిపించింది అని హేమంత్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇదిలా ఉండగా అంతకు కొన్ని గంటల ముందే చిత్ర తన ఇన్స్టాగ్రామ్ లో తనది ఒక అందమైన ఫోటో పెట్టి చాలా ఆనందంగా ఉన్నట్టుగా ఎమోజి తో వ్యక్తం చేసింది. మరింత ఆనందంగా ఉన్న ఈమె ఇంత తక్కువ గ్యాప్ లోనే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొంది అని ఆమె ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతున్నారు. ఆమె తమిళ్ లో పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది.
