రెమ్యునరేషన్ పెంచడంలో తప్పు లేదు – జగపతి బాబు

Jagapathi-Babu
చాలా సంవత్సరాలు ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకున్న మాన్లీ హీరో జగపతి బాబు ‘లెజెండ్’ సినిమాతో సరికొత్త కెరీర్ ని ప్రారంభించాడు. ఈ సినిమా విజయం సాధించడంతో జగపతి బాబుకి విలన్ గా మంచి పేరు వచ్చింది. దీంతో జగపతి బాబుకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

దీంతో జగపతి బాబు రెమ్యునరేషన్ భారీగా పెంచేసారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయన ముందు ఉంచితే జగపతి బాబు సమాధానం ఇస్తూ ‘ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల ఎలాంటి తప్పు లేదు. ఇప్పటి వరకూ నేను రివర్స్ లో ఇచ్చే వాణ్ని, ఇప్పుడన్నా నన్ను తీసుకోనివ్వండి. నా కెరీర్లో ఇదొక మంచి పరిణామం, నేను దానిని ఎంజాయ్ చేస్తున్నాను. గతంలో నా సినిమాల రిలీజ్ విషయంలో చాలా టెన్షన్ ఉండేది అలాగే రిలీజ్ కోసం నేను మనీ కట్టేవాన్ని. ఇప్పుడు నాకు అలాంటి సమస్యలేమీ లేవని’ సమాధానం ఇచ్చాడు.

ప్రస్తుతం జగపతి బాబు రెండు మూడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.

Exit mobile version