సమరానికి సిద్దమైన ఎన్.టి.ఆర్ – అల్లు అర్జున్

సమరానికి సిద్దమైన ఎన్.టి.ఆర్ – అల్లు అర్జున్

Published on Dec 26, 2014 5:05 PM IST

ntr-allu-arjun
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ సినిమా సంక్రాంతి బారి నుంచి తప్పుకొని ఫిబ్రవరికి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. కానీ కచ్చితమైన రిలీజ్ డేట్ మాత్రం ఖరారు చేయలేదు. తాజాగా ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఫిబ్రవరి 5న సినిమా రిలీజ్ చెయ్యనున్నామని ఖరారు చేసారు.

ఇదిలా ఉంటె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఓ కొత్త సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాని కూడా ఫిబ్రవరి 5న రిలీజ్ చెయ్యనున్నామని వారు ఇది వరకే తెలియజేశారు. దీని ప్రకారం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీసు వద్ద తమ సినిమాలతో తలపడనున్నారు. మరి ఈ సమరంలో ఎవరు గెలుస్తారనే దానికోసం మరికొద్ది రోజులు వేచి చూడాలి. అలాగే అనుకున్న దాని ప్రకారం ఈ ఇద్దరు ఫిబ్రవరి 5న వస్తారా లేక ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి.

తాజా వార్తలు