ఎన్టీఆర్ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్..?

NTR_Shruti-Haasan
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో శృతి హాసన్ ఐటెం సాంగులో సందడి చేయనుంది అంటూ ఫిల్మ్ నగర్ లో ఓ వార్త షికారు చేస్తుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. మొదట ఈ సినిమాలో సన్నీ లియోన్ చేత ఐటెం సాంగు చేయిచాలని దర్శకనిర్మాతలు భావించారు. ‘ఆగడు’ సినిమా చూసిన తర్వాత శృతి హాసన్ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించారని, శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్.

‘గబ్బర్ సింగ్’ సినిమాతో గోల్డెన్ లెగ్ గా మారిన శృతి, ‘ఆగడు’తో ఐటెం గర్ల్ గా తన సత్తా చాటింది. తనకు ఫస్ట్ సక్సెస్ అందించిన ‘గబ్బర్ సింగ్’ నిర్మాత బండ్ల గణేష్.. ఎన్టీఆర్ సినిమాను నిర్మిస్తుండడంతో శృతి కాదనే అవకాశం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వెయిట్ & సి ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్.

Exit mobile version