ఎన్టీఆర్ ‘కథానాయకుడు’తో పాటు ‘మహానాయకుడు’ కూడా !

maha
క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం, నాలుగు షెడ్యూల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత రెండు రోజులుగా దివిసీమ ప్రాంతాల్లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ జరుపుకుటుంది.

కాగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. జనవరి 9న విడుదలయ్యే మొదటి పార్ట్ టైటిల్ ను ‘కథానాయకుడు’ అని పెట్టినట్లు చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా జనవరి 24న విడుదలయ్యే రెండో పార్ట్ టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేశారు. రెండో పార్ట్ కి ‘మహానాయకుడు’ అని టైటిల్ ని ఫిక్స్ చేసింది చిత్రబృందం.

మరో రెండు నెలల్లో ఈ చిత్రం టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version