యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కి ఈ సంవత్సరం ఎంతో మరిచిపోలేనిదిగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఎన్.టి.ఆర్ తండ్రైన రోజు. ఎన్.టి.ఆర్ సతీమణి ప్రణతి ఈ రోజు ఉదయం 11 గంటలకు రెయిన్ బో హాస్పిటల్స్ లో పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. దీనితో ఎన్.టి.ఆర్ కుటుంబం అంతా ఎంతో ఆనందంలో ఉన్నారు.
గత కొద్ది రోజులుగా ఈ శుభవార్త వినగానే ఎన్.టి.ఆర్ మరియు ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ దంపతులకు 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న రభస సినిమా కూడా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా ఆడియోని ఆగష్టు 1న రిలీజ్ చేసి, ఆగష్టు 14న సినిమాని రిలీజ్ చేయనున్నారు.
