ఎన్టీఆర్ ‘డ్రాగన్’ పట్ల నార్త్ ఆడియెన్స్ ఈ రేంజ్ హైప్ లో ఉన్నారా!

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ పట్ల నార్త్ ఆడియెన్స్ ఈ రేంజ్ హైప్ లో ఉన్నారా!

Published on May 28, 2026 11:01 AM IST

dragon

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా హీరోయిన్ రుక్మిణి వసంత్ కలయికలో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సాలిడ్ చిత్రం ‘డ్రాగన్’ కోసం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన సాలిడ్ గ్లింప్స్ ఆడియెన్స్ లో సాలిడ్ బజ్ ని రేకెత్తించింది.

అయితే ఈ సినిమా గ్లింప్స్ తెలుగు రెస్పాన్స్ ఏమో కానీ నార్త్ ఆడియెన్స్ మాత్రం డ్రాగన్ గ్లింప్స్ కి మాస్ రెస్పాన్స్ ని అందిస్తున్నారు. కేవలం ఈ కొన్ని గంటల్లోనే మిలిన్స్ కొద్దీ వ్యూస్ ఈ సినిమా కోసం వస్తూ సాలిడ్ రెస్పాన్స్ ని అందించారు. ఇలా ఈ గ్లింప్స్ ఏకంగా ఒక్క హిందీ వెర్షన్ లోనే ఏకంగా 40 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది.

ఇందులో దాదాపు 7 మిలియన్ వ్యూస్ ఈ రెండు రోజుల్లోపే వచ్చేసాయి. దీనితో హిందీ వెర్షన్ లో మాత్రం డ్రాగన్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాల్సిందే. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జూన్ 11న ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు