‘డ్రాగన్’ అసలు ట్రీట్ కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే ‘డ్రాగన్’. సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ తో క్రేజీ ట్రీట్ ని ఇచ్చింది. అక్కడ నుంచి మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో తారక్ లుక్ కూడా రివీల్ అయ్యి దీనికి మాస్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమాలో తారక్ లుగర్ లుక్ చూశాం కానీ అసలు లుక్ డ్రాగన్ వెర్షన్ ని ఇంకా చూడలేదు. అయితే దీనిపైనే క్రేజీ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ‘డ్రాగన్’ లుక్ ఈ ఏడాది డిసెంబర్ లోనే వచ్చే ఛాన్స్ ఉందట. అంటే ఇంకా 6 నెలలు ఆగాల్సిందే అని చెప్పాలి. తారక్ ఆల్రెడీ క్రేజీ లుక్ ని ఈ సినిమాకి రెడీ చేసి షాకిచ్చాడు. ఇక డ్రాగన్ లుక్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version