డాన్స్ ఫినిష్ చేసి యాక్షన్ షురూ చేసిన ఎన్.టి.ఆర్

Ntr
‘టెంపర్’ సినిమాతో సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫ్రెష్ ఎనర్జీతో తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. సుకుమార్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జూలై మొదటి వారంలో లండన్ లో మొదలైంది. సుకుమార్ మొదట యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు పెట్టి, ఆ తర్వాత కొన్ని సీన్స్ మరియు ఓ సాంగ్ ని షూట్ చేసాడు. గత 5 రోజులుగా ఎన్.టి.ఆర్ – రకుల్ ప్రీత్ సింగ్ లపై రాజు సుందరం మాస్టర్ కంపోజింగ్ లో ఓ సాంగ్ షూట్ ని ఫినిష్ చేసారు.

నిన్నటితో సాంగ్ షూట్ ని ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం నేటి నుంచి ఎన్.టి.ఆర్ పై మరో యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారని లండన్ లోని చిత్ర టీం తెలిపింది. ఎన్.టి.ఆర్ – ఫైటర్స్ మధ్య వచ్చే ఈ ఫైట్ ని పీటర్ హెయిన్ చాలా స్టైలిష్ గా కంపోజ్ చేస్తున్నాడని సమాచారం. ఈ నెలలో మొదలైన ఈ లండన్ షెడ్యూల్ సెప్టెంబర్ 20 వరకూ కంటిన్యూగా జరగనుంది. ఆ తర్వాత యూరప్ కి షిఫ్ట్ అవుతుంది. ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం. షూటింగ్ మొదటి రోజే రిలీజ్ చేసిన ఎన్.టి.ఆర్ న్యూ స్టైలిష్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

Exit mobile version