‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్.. మళ్లీ షూట్ ఎప్పుడంటే ?

Dragon

యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా డ్రాగన్. ఐతే, ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో ఆగస్టు 12న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఐతే, అక్టోబర్‌ ఫస్ట్ వీక్ లో ఎన్టీఆర్ తిరిగి ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఈ లోపు ఎన్టీఆర్ లేని సీన్స్ ను షూట్ చేస్తారట. అన్నట్టు ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది.

కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ ఫ్లాష్ బ్యాక్ కోసం అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version