పోలీస్ స్టేషన్ లో కాజల్ ని ఆటపట్టిస్తున్న ఎన్.టి.ఆర్

ntr-kajal
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన కెరీర్లో ఫుల్ లేగ్త్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాలో పోలీస్ గా ఎన్.టి.ఆర్ లో సరికొత్త యాంగిల్ ని చూపించనున్నాడు. ఈ సినిమా కోసం బేగంపేట్ లో ఓ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ వేస్తున్నారని ఇది వరకే తెలియజేశాం. ఆ సెట్ పని పూర్తవడంతో ఈ చిత్ర టీం పోలీస్ స్టేషన్ సెట్ లో షూటింగ్ చేయడం మొదలు పెట్టారు.

ప్రస్తుతం పోలీస్ స్టేషన్ సెట్ లో తన స్టేషన్ కి వచ్చిన కాజల్ అగర్వాల్ లో ఎన్.టి.ఆర్ కామెడీ చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ – కాజల్ – కోవై సరళలపై పూరి జగన్నాధ్ కొన్ని కామెడీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. సుమారు 11 రోజులకి పైగా పోలీస్ స్టేషన్ సెట్లో షూటింగ్ జరగనుంది. దాంతో చాలా వరకూ టాకీ పార్ట్ పూర్తవుతుంది.

మొదటిసారి పూరి జగన్నాధ్ వక్కంతం వంశీ అందించిన కథకి దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ‘బాద్షా’ తర్వాత ఎన్.టి.ఆర్ తో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version