ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల మరో సారి వాయిదాపడనుందా ?

NTR

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద పూర్తిగా నిరాశపరిచింది. రివ్యూస్ పాజిటివ్ గానే వచ్చిన డివైడ్ టాక్ రావడంతో సినిమా విజయం సాధించలేకపోయింది. ఈ ఎఫెక్ట్ రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడి ఫై పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం మొదటగా ఫిబ్రవరి 7న విడుదలఅవుతుందని ప్రకటించిన ఆతరువాత ఇటీవల కొత్త విడుదల తేదీ (ఫిబ్రవరి 14)ని ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ తేదీ కి విడుదలవ్వడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. విడుదలకు సమయం దగ్గర పడుతున్న సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం ఈ అనుమానాలకు భలం చేకూర్చుతుంది.

మరి ఈ చిత్రాన్ని అనుకున్నట్లుగా వచ్చే నెల 14న విడుదలచేస్తారో లేదా మళ్ళీ వాయిదా వేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Exit mobile version