మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ సినిమా కోసం అందరికీ తెలిసిందే మ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న లీక్ లేకుండా చాలా పక్కాగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కేవలం ఎన్టీఆర్ లుక్ వరకు మాత్రమే కొంచెం క్లారిటీ ఉంది.
ఇక దీనితో పాటుగా చాలామంది ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక బ్లాస్ట్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. ఈసారి మాత్రం ఎన్టీఆర్ అభిమానులకి ఎలాంటి నిరాశ కలగకుండా ఉంటుంది అని టాక్. అప్డేట్ అయితే పక్కా ఉంటుందట. సో తారక్ అభిమానులు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనే చెప్పొచ్చు. ఈ భారీ సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
