ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం (NTR Neel) కోసం అందరికీ తెలిసిందే. ఈ భారీ కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా గత కొంత కాలం నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా చిన్న అప్డేట్ అయినా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి కొన్నాళ్ల నుంచి సైలెంట్ గానే కొనసాగుతున్న ఈ సినిమాపై మరోసారి సినిమాటోగ్రాఫర్ అప్డేట్ అందించాడు.
NTR Neel in Night Shoots – నైట్ మోడ్ లో ఎన్టీఆర్, నీల్ షూట్
ఈ సినిమా (NTR Neel) కి కెమెరా వర్క్ అందిస్తున్న కెమెరా మెన్ భువన్ గౌడ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కీలక అప్డేట్ అయితే అందించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో నైట్ మోడ్ లో జరుపుతున్నట్టు కన్ఫర్మ్ చేసాడు. సో ఎన్టీఆర్ నీల్ లో రాత్రి పూట గడిచే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని చెప్పాలి.
దీనికి ముందు కూడా అప్డేట్ ఇచ్చిన భువన్
ఇప్పుడు నైట్ షూట్ కోసం కాకుండానే దీనికి ముందు కూడా తాము ప్రస్తుతం లొకేషన్స్ రెక్కీలో ఉన్నట్టు తాను తెలిపాడు. వీటి తర్వాత మళ్ళీ షూట్ ని ఫైనల్ గా స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు అనుకోవాలి.
