ఎన్.టి.ఆర్ ‘జనత గ్యారేజ్’ ఫస్ట్ షెడ్యూల్ డీటైల్స్

ntr
సంక్రాంతికి వచ్చి ‘నాన్నకు ప్రేమతో’తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమా విజయానందంలో ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమాని మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఈ సినిమా కోసం తన లుక్ ని మార్చుకునే పనిలో ఉన్నాడు. వరుస హిట్స్ తో ఊపు మీదున్న కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కోసం సారధి స్టూడియోస్ లో 2.5కోట్లతో భారీ సెట్ ని కూడా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదలవుతుందని ఇది వరకే తెలిపాం. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు. మొదటి షెడ్యూల్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై వచ్చే సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఆ తర్వాత నుంచి జరగనున్న సెకండ్ షెడ్యూల్ లో ఎన్.టి.ఆర్ కూడా పాల్గొననున్నాడు. మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఉన్ని ముకుందన్ కనిపించనున్నాడు. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version