మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు(మే 20) సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌కు ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్లుగానే ‘డ్రాగన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను రివీల్ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లేలా ఒక క్రేజీ గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ గ్లింప్స్ వీడియో సాధారణ టీజర్లలా కాకుండా ఏకంగా నాలుగు నిమిషాలకు పైగా నిడివితో ఒక పూర్తిస్థాయి ట్రైలర్ తరహాలో రావడం విశేషం. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ఈ వీడియోలో తన మార్క్ యాక్షన్ అండ్ ఎలివేషన్లను ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా కట్ చేశాడు. ఈ గ్లింప్స్ చూస్తుంటే సినిమా మొత్తం ఏ రేంజ్ కంటెంట్‌తో, ఎంతటి భారీ కాన్సెప్ట్‌తో ఉండబోతోందనే విషయంపై ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేసింది.
ఇక ఈ గ్లింప్స్ వీడియోలో సినిమాలోని అనేక పాత్రలను ఇంట్రొడ్యూస్ చేసిన ప్రశాంత్ నీల్, కథలోని మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ను కూడా రివీల్ చేశాడు. ఈ కథలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందనే శాంపిల్ కూడా మనకు చూపెట్టాడు. ప్రశాంత్ నీల్ మార్క్ టేకింగ్‌కు ఎన్టీఆర్ లెవెల్ పర్ఫార్మెన్స్ యాడ్ అయితే, ఆ సీన్స్ ఎలా పండుతాయో ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆస్వాదించాల్సిందే.
నిజానికి ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల షూటింగ్స్ వాయిదా పడుతూ వస్తుండటంతో, ఎట్టకేలకు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2027 జూన్ 11న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఈ వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంత్ నీల్ విజువల్ వండర్ కలగలిసిన ఈ సరికొత్త ‘డ్రాగన్’ ప్రపంచాన్ని మీరు కూడా ఓసారి చూసేయండి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
