
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం గోవా బీచ్ లో సందడి చేస్తున్నాడు. ఏదో ఎంజాయ్ మెంట్ కోసం సందడి కాదండోయ్.. ఎందుకంటే ఈ సందడి పూరి జగన్నాధ్ సృష్టించింది. ఎన్.టి.ఆర్ పూరి జగన్నాధ్ ల మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ప్రస్తుతం గోవాలోని ఓ ఫేమస్ బీచ్ లో షూట్ చేస్తున్నారు. గత నెల 25న గోవా షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ ఈ నెల 23 వరకూ జరగనుంది. ఈ షెడ్యూల్లో ఎన్.టి.ఆర్ తో పాటు ప్రకాష్ రాజ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పాల్గొంటోంది.
ఈ షెడ్యూల్ తో ఈ సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని పాటలను గోవా షెడ్యూల్ పూర్తయ్యాక టీం మొత్తం హైదరాబాద్ తిరిగి వస్తారు. మళ్ళీ ఇక్కడ వేడిన పోలీస్ స్టేషన్ సెట్లో షూటింగ్ చేసారు. వక్కంతం వంశీ అందించిన కథకి పూరి మార్క్ డైలాగ్స్ మరియు టేకింగ్ హైలైట్ అవుతాయని ఈ చిత్ర టీం అంటోంది. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ తర్వాత ఎన్.టి.ఆ రతో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు.