తన అభిమాని మరణంతో దిగ్బ్రాంతి చెందిన ఎన్,టి.ఆర్

NTR-3
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన మనసులోని భావాలను ఎటువంటి బేషజాలు లేకుండా వ్యక్తీకరించడంలో ముందుంటాడు. ఈరోజు తారక్ ట్విట్టర్ లో తన అభిమాని మరణంతో కుదించుకుపోయాడు. ఎందుకా అని అనుకుంటే ఈ వార్త చదవండి మరి

రెండు రోజుల క్రితమే క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఖమ్మంకి చెందిన చిన్నారి మహ్యబ తన చివరికోరికగా అభిమాన హీరో అయిన తారక్ ని కలవాలని కోరుకుంది. ఈ చిన్నారి నిరుపేద కుటుంబానికి చెందడంతో దాతల సహాయం కూడా కోరారు

అయితే ఈ వార్త తారక్ చెవిన పడి ఆ పాపని కలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో కోన ఊపిరితో కట్టుకుంటున్న ఆ చిన్నారి తుదిశ్వాస విదిచిందని తెలియడంతో తారక్ బృందం దిగ్బ్రాంతికి లోనయ్యారు

ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఆ దేవుడు మనోనిబ్బరాన్ని ప్రసాదించాలని, ఆ చిన్నారికి నన్ను చూడాలని వుందని తెలిసినవెంటనే ఆ పాప తుదిశ్వాస విడిచిందని తెలుసుకున్నానని ట్వీట్ల ద్వారా తెలిపాడు

Exit mobile version