యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాక్స్ ఆఫీసు వద్ద ఒక స్ట్రాంగ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఎంతో కసిగా చేసిన పవర్ఫుల్ పోలీస్ డ్రామా ‘టెంపర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఎంతో కసితో చేసిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఈ సినిమాకి సంబందించిన మేజర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొన్ని డిపార్ట్ మెంట్స్ తమ వర్క్ ని చివరి దశకు తీసుకు వచ్చాయి. డిటిఎస్ మిక్సింగ్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి.
ఇకపోతే ఈ సినిమాలోని నటీనటుల డబ్బింగ్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యింది. ఎన్.టి.ఆర్ కూడా ఈ రోజు నుంచే తన పార్ట్ కి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు. మరో రెండు రోజుల్లో ఎన్.టి.ఆర్ తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని ఫినిష్ చెయ్యనున్నాడు. ఈ చిత్ర టీం అన్ని కార్యక్రమాలను 8వ తేదీలోపు ఫినిష్ చేసి 9న సెన్సార్ కి పంపడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
