పర్ఫెక్ట్ అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన ‘టెంపర్’ సినిమాతో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమా సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం పూర్తయ్యాయి. దాంతో జూలై మొదటి వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లండన్ లో మొదలవుతుందని ఇదివరకే తెలియజేశాం. ఈ చిత్ర టీం చెబుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం జూలై 6వ తేదీ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ నెలాఖరులోగా ఈ చిత్ర టీం మొత్తం లండన్ చేరుకోనుంది. ఫస్ట్ షెడ్యూల్ లో మొదటగా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఎన్.టి.ఆర్ పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తారు. సినిమా అనుకున్న టైం కంటే కాస్త ఆలస్యంగా స్టార్ట్ అవుతుండడం వలన ఈ చిత్ర టీం కంటిన్యూగా షూటింగ్ చేయనున్నారు. జూలై 6 నుంచి మొదలయ్యే షెడ్యూల్ ని కంటిన్యూగా సెప్టెంబర్ 15 వరకూ చేయడానికి ప్లాన్ చేసారు. అలాగే 2016 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ చిత్ర వర్గాలు తెలిపారు.
ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తన లుక్ ని మార్చుకొనే పనిలో ఉన్నాడు. ఎన్.టి.ఆర్ కోసం స్టైలిష్ గడ్డం లుక్ ని డిజైన్ చేసారని సమాచారం. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
