సుకుమార్ కోసం ఎన్.టి.ఆర్ గడ్డం లుక్

NTR
4 నెలల గ్యాప్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న తన తదుపరి సినిమా కోసం సిద్దమవుతున్నాడు. అన్ని ఇబ్బందులు తొలగిపోవడంతో జూలై 1 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లండన్ లో ప్రారంభం కానుంది. ఈ చిత్ర టీం జూన్ 28న బయలుదేరి లండన్ వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎన్.టి.ఆర్ మరో స్టైలిష్ లుక్ ని ట్రై చేయనున్నాడని ఇది వరకే తెలియజేశాం.

మాకు అందిన లేటెస్ట్ సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో సరికొత్త హెయిర్ స్టైల్ తో పాటు సరికొత్త గడ్డం తో కనిపించనున్నాడు. అందుకోసమే గత కొంతకాలంగా ఎన్.టి.ఆర్ గడ్డం పెంచుతున్నాడని ఈ చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ రివెంజ్ డ్రామా సినిమాలో ఎన్. టి.ఆర్ ని మునుపెన్నడూ చూడని లుక్ లో చూపించడానికి సుకుమార్ సిద్దమయ్యారు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

Exit mobile version