ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటే “వారణాసి”. ఒక్క ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా ప్రభావం చూపిస్తుంది అని చాలామంది భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా మేకర్స్ పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనసాగుతున్న షూట్ కి ఇప్పుడు కొంచెం బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారణాసి బృందం ఇప్పుడు వాటర్ కొరత ఎదుర్కొన్నట్టు టాక్.
హైదరాబాద్ లో సినిమా షూట్ చేస్తుండగా కేవలం ఈ షూట్ కోసం వారు మొత్తం 150 నీళ్ల ట్యాంకర్లని కోరారట. హైదరాబాద్ మున్సిపల్ శాఖ ఈ వేసవి కారణంగా సామాన్య జనం నీటి ఎద్దడి ఎదుర్కోకూడదని వారిని మొదటి ప్రియారిటీగా తీసుకొని వారికి అందించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సో వారణాసి కొంచెం స్లో అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఏకకాలంలో అనేక భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
