ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ప్రిస్టేజియస్ పీరియాడిక్ వండర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇక ఈ చిత్రంలో విప్లకారులు అల్లూరి సీతా రామరాజు అలాగే కొమరం భీం పాత్రల్లో చరణ్ మరియు తారక్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే వచ్చిన తారక్ టీజర్ కు అయితే కనీ వినీ ఎరుగని రీతి రెస్పాన్స్ వచ్చింది.
అలాగే లేటెస్ట్ గా మాత్రం మరో సాలిడ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో తారక్ కనిపించే ఒక లుక్ కంప్లీట్ గా థియేటర్స్ లో ఆడియెన్స్ కు మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తుందట. అలాగే ఈ లుక్ పరంగా తారక్ ఒక వయసు మళ్ళిన పాత్రలో ఒక 10 నిమిషాల ఎపిసోడ్ లో కనిపిస్తాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. నటనలో ఎన్నో వైవిధ్యాలు చూపగలిగే తారక్ ఈ గెటప్ లో ఎలా కనిపిస్తాడా అని ఈ సినిమా కోసం ఎదురు చూసే వాళ్ళు అంతా మరింత ఆసక్తిని పెంచుకున్నారు.
