
12 ఏళ్ళ క్రితం ‘సింహాద్రి’ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమలో సరికొత్త రికార్డులు సృష్టించిన వారే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఎన్.టి.ఆర్ రాజమౌళి ముద్దుగా పెట్టిన పేరు జక్కన్న. వీరిద్దరూ హీరో, దర్శకులు అనే దానికంటే ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి ఉంటారు. జక్కన్న మూడేళ్ళ పాటు ఎంతో కష్టపడి చేసిన సినిమా ‘బాహుబలి’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని పనులను పూర్తి చేసిన రాజమౌళి టీం ఒకింత టెన్షన్ తో, ఒకింత ఆసక్తిగా ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని ప్రముఖులంతా ఈ సినిమా టాలీవుడ్ తో పాటు ఇండియా కూడా గర్వంగా చెప్పుకునే సినిమా కావాలని బెస్ట్ విషెష్ చెప్తున్నారు.
కొద్ది సేపటి క్రితమే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాహుబలి టీంకి ట్విట్టర్ ద్వారా బెస్ట్ విషెస్ తెలియజేశాడు. ‘బాహుబలి టీం అంతటికి ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా ఎంతో విజన్ ఉన్న జక్కన్న కచ్చితంగా వరల్డ్ సినిమాని థ్రిల్ చేస్తాడని ఎంతో నమ్మకంగా ఉన్నాను. తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా బాహుబలి వ్యాపింపజేస్తుందని నా నమ్మకం’ అని ఎన్.టి.ఆర్ పోస్ట్ చేసాడు. బాహుబలి టీం కూడా ఎన్.టి.ఆర్ విషెస్ కి థాంక్స్ చెప్పారు. బాహుబలి రేపు నాలుగు భాషల్లో సుమారు 400కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.