
‘టెంపర్’ లాంటి సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. తన 25వ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండాలని క్రేజీ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి, తన లుక్ ని పూర్తిగా మార్చుకొని చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయ్యింది. ఇది పక్కనే పెడితే ఇటీవలే ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలియజేశాం. అలాగే ఈ సినిమాని దసరా సీజన్ లో అధికారికంగా లంచ్ చేయనున్నారని తెలియజేశాం.
మేము చెప్పిన దాని ప్రకారమే ఈ రోజు ఉదయం ఎన్.టి.ఆర్ కొరటాల శివ మూవీని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు. ఈ వేడుకకి ఎన్.టి.ఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా హాజరయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా డిసెంబర్ లేదా జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే ఈ సినిమా కోసం ‘జనత గ్యారేజ్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఫైనల్ గా ఈ టైటిల్ మారే అవకాశం కూడా ఉంది. ఎన్.టి.ఆర్ ఈ నెలాఖరున నాన్నకు ప్రేమతో ఫైనల్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నాడు. వచ్చేలోపు కొరటాల శివ ఫుల్ స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని ఫినిష్ చేయనున్నాడు.