
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. సుకుమార్ అంటే డీటైలింగ్‌కు, స్క్రీన్‌ప్లే మ్యాజిక్కు పెట్టింది పేరు. ఇక మాస్, యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్‌తో పాటు నటన పరంగా ది బెస్ట్ అనిపించుకున్న హీరో ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే దానిపై ఏ స్థాయి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌లో ఎన్టీఆర్ గెటప్‌కు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర కథనం ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గెటప్‌లో ఒక రోల్ ఉండనుండగా, మరో రోల్ కూడా సినిమాకు హైలైట్‌గా నిలుస్తోంది. అయితే సినిమా యూనిట్ మాత్రం ఈ విషయమై గోప్యత పాటిస్తోంది. ఇక ఇదిలా ఉంటే రేపు వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కానుండగా, జనవరిలో సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.