‘ఎన్టీఆర్’కి హీరోయిన్ ఇంకా దొరకలేదా ?

ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ కొన్ని పర్సనల్ ప్రొబ్లెమ్స్ వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచీ రాజమౌళి తారక్ కోసం హీరోయిన్ని వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు.

అయితే ప్రస్తుతం రాజమౌళి కొంతమంది హీరోయిన్ లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. వాళ్లలో నుండి త్వరలోనే ఓ హీరోయిన్ ను ఫైనల్ చేస్తారట. ఇక ఇప్పటికే ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version