అఫీషియల్: ‘పెద్ది’ స్టార్ తో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు.. క్రేజీ కాంబినేషన్!

అఫీషియల్: ‘పెద్ది’ స్టార్ తో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు.. క్రేజీ కాంబినేషన్!

Published on May 31, 2026 6:07 PM IST

కన్నడ సినిమా దగ్గర మంచి మోస్ట్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిగిన అతికొద్ది మంది నటుల్లో నటుడు శివరాజ్ కుమార్ కూడా ఒకరు. జైలర్ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా తన పేరు మారుమోగింది. అయితే దీని తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో “పెద్ది” సినిమాలో కీలక పాత్ర తాను చేస్తుండగా ఇప్పుడు కోలీవుడ్ కి తాను వెళ్లడం విశేషం.

ఇక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో తాను ఇపుడు రాబోతున్నారు. తన మొదటి సినిమా తోనే సత్తా చాటిన యువ దర్శకుడు అభీషన్ జీవింత్ ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ తో వర్క్ చేస్తున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమో విడుదల చేసి ఖరారు చేసాడు. టూరిస్ట్ ఫ్యామిలీ తో దర్శకునిగా తర్వాత హీరోగా విత్ లవ్ సినిమాతో సక్సెస్ అయ్యిన తాను ఇప్పుడు దర్శకునిగా శివ రాజ్ కుమార్ తో చేస్తుండడం సౌత్ సినీ వర్గాల్లో హిట్ టాపిక్ గా మారింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే వస్తాయని అభీషన్ కన్ఫర్మ్ చేసాడు.

తాజా వార్తలు